కోడిగుడ్లను ఫ్రిడ్జ్ లో పెడుతున్నారా? అయితే మీకు డేంజర్ లో ఉన్నట్టే..

0
87

ప్రస్తుతం అందరు మార్కెట్లో వారానికి సరిపడా కూరగాయలు, పండ్లను తెచ్చుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని వాడుతుంటారు. కానీ అలా వాడడం వల్ల అనేక దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా కోడిగుడ్లను ఫ్రిజ్ లో పెట్టడం విషం కంటే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకో మీరు కూడా చూడండి..

గుడ్లను ఫ్రిజ్ లో ఉంచడం వల్ల వాటిలో ఎక్కువ శాతం బ్యాక్టీరియా పెరుగుతుంది.  దీనివల్ల అనేక రకాల సమస్యలు కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. గుడ్లలో క్యాల్షియం, ప్రొటీన్ ఉండడం వల్ల వాటిని సాధారణస్థాయిలో ఉంచినప్పుడు మాత్రమే మన శరీరానికి కావాల్సిన అన్ని రకాల విటమిన్స్, ప్రోటీన్స్ లభిస్తాయి.

ఇంకా అతిగా వేడిగా ఉన్న ప్రదేశంలో కూడా కోడిగుడ్లను పెట్టకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అత్యవసర పనిమీద కోడిగుడ్లను ఫ్రిడ్జ్ లో పెట్టిన తినేముందు కనీసం రెండుగంటల పాటు సాధారణ వాతావరణంలో పెట్టిన తర్వాత తింటే కాస్త ప్రమాదం నుండి తప్పించుకున్న వాళ్ళం అవుతాం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.