వర్షాకాలం – చలికాలం మటన్ ,పాలు ఎందుకు తీసుకోకూడదో తెలుసా

Rainy season , winter season - do you know why not take Mutton and milk

0
116

సీజన్ బట్టీ ఫుడ్ తీసుకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. కొందరు సమ్మర్ లో మంచి ఘాటైన మసాలా ఫుడ్ తింటారు. వారి శరీరం మరింత వేడి చేస్తుంది. ఇక కొందరు వర్షాకాలం శీతాకాలం బాగా కూల్ చేసే ఫుడ్ తింటారు. జలుబు గొంతు నొప్పి వేధిస్తుంది. ఇలా సీజన్ బట్టీ ఫుడ్ డైట్ ఫాలో అవ్వాలి. ముఖ్యంగా వర్షాలు కురిసే సమయంలో చలి ఎక్కువగా ఉండే కాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

శరీరంపై ప్రత్యేక శ్రద్దపెట్టాలి. ముఖ్యంగా శీతాకాలం డ్రింకులు శీతల పానీయాలు, రంగు రంగుల ఐస్ క్రీములు, కూల్ కేకులు చాక్లెట్స్ కు దూరంగా ఉండాలి. ఇక వర్షాకాలం కూడా వీటికి దూరంగా ఉండాలి. అయితే చాలా మంది ముక్క లేనిదే ముద్ద దిగదు అంటారు. కానీ శీతాకాలంలో ఎర్రని మాంసం తినకపోవడం మంచిది.

పాలు , మటన్ తినడం వల్ల అధిక ప్రోటీన్లు గొంతులోని మ్యూకస్ ను పెంచుతాయి. అందుకే ప్రాసెస్ చేసిన మాంసం, అధిక కొవ్వు ఉన్న మాంసం తినవద్దు. వర్షం పడిన సమయంలో కూడా ఇలా మటన్ కు దూరంగా ఉండటం మేలు. పాల వల్ల కఫం వస్తుంది. గొంతులో గరగర స్టార్ట్ అవుతుంది. అందుకే శీతాకాలం ఈ రెండింటికి దూరంగా ఉండాలి.