తెలంగాణను చలి వణికిస్తోంది. రోజురోజుకు తగ్గుతున్న ఉష్ణోగ్రతలతో చలితీవ్రత పెరుగుతుండటం వల్ల ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. దీనితో వాతావరణ శాఖ రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది.
మునుపెన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు తగ్గుతుడటం వల్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నందున చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
కుమురం భీం జిల్లా గిన్నెధరిలో అత్యల్పంగా 3.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. సిర్పూర్‌లో ఉష్ణోగ్రత 3.8 డిగ్రీలకు పడిపోయింది. ఆదిలాబాద్ జిల్లా బేలలో 3.8 డిగ్రీలు, భీంపూర్ మం. అర్లి(టి)లో 3.9 డిగ్రీలు, జైనథ్‌లో 4.9 డిగ్రీలు, కుమురం భీం జిల్లా వాంకిడిలో 4.9 డిగ్రీలు నమోదైంది.