కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గించుకోండిలా?

0
127

ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో కంటి కింద నల్లటి వలయాలు కూడా ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. దీనికి అనేక కారణాలు ఉండగా..ముఖ్యంగా టీవీ చూడటం, పోషకాహార లోపం, కంప్యూటర్​ను అలాగే కళ్లప్పగించి చూస్తూ ఉండడం వల్ల ఈ సమస్య వచ్చింది.

అంతేకాకుండా కళ్ళ కింద నల్లని వలయాలకి హెరిడిటీ, వయసు, మానసిక, శారీరక ఒత్తిడి, హార్మోన్లలో మార్పులు, అన్ని పోషకాలతో నిండిన ఆహారం తీసుకోకపోవడం వంటివన్నీ కూడా డార్క్‌సర్కిల్స్‌కి కారణాలని నిపుణులు చేబుతున్నారు.

ఈ సమస్యను దూరం చేయడంలో టొమేటోలు సహాయపడతాయి. టొమేటోస్‌లో ఉండే లైకోపిన్ డార్క్ సర్కిల్స్ రాకుండా చేయడంలో ఉపయోగపడతాయి. టొమేటో జ్యూస్‌ని, నిమ్మరసాన్ని సమాన భాగాలుగా కలిపి ఒక కాటన్ బాల్‌తో కళ్ళ కింద అప్లై చేసి పది నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడగడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.