ఏపీ కరోనా బులెటిన్ విడుదల..జిల్లాల వారిగా కేసుల వివరాలు ఇలా..

0
85

కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తుంది. దేశవ్యాప్తంగా గతకొన్ని రోజులుగా కొత్త కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరోవైపు ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే దేశంలో మూడో వేవ్‌ మొదలైందనే అనిపిస్తుంది.

తాజాగా ఏపీలోనూ కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఆదివారం (జనవరి 9) కొత్తగా 1,257 మంది వైరస్‌ బారిన పడినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 38, 479 శాంపిల్స్ పరీక్షించగా 1257 కేసులు నిర్ధారణ అయ్యాయి. కాగా వైరస్ బారిన పడి.. గుంటూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. తాజాగా..మరో 140 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. కొత్త కేసులతో కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో 4774 కరోనా యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

కాగా గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.

అనంతపురం  138

చిత్తూరు         254

ఈస్ట్ గోదావరి 93

గుంటూరు 104

వైస్సార్ కడప 20

కృష్ణ   117

కర్నూల్  29

నెల్లూరు   103

ప్రకాశం    40

శ్రీకాకుళం 55

విశాఖపట్నం  196

విజయవాడ   83

వెస్ట్ గోదావరి   25