మనిషి ఆరోగ్యంగా ఉండాలి అప్పుడే ఏదైనా చేస్తాడు, అయితే చాలా చోట్ల మనం వింటాం, కిడ్నీ చిన్నగా ఉంటుంది అందులో రాళ్లు ఉన్నాయి అని మాటలు వింటాం, ఇంత చిన్నదానిలో ఎలా రాళ్లు వస్తాయి అంటే ముఖ్యంగా ఆహరం వల్లే వస్తాయి.
ఈ రోజుల్లో చాలా మంది ఫ్రై ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు, వేపుళ్లు, నూనె పదార్థాలు, ఐస్క్రీమ్ల, కేకులు, కూల్ డ్రింకుల వంటివి ఎక్కువగా తీసుకుంటున్నారు.
ఇదే పెనుముప్పు కొన్ని ఫుడ్స్ తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఎవరైనా ఎక్కువగా కాప్సికం వాడుతూ ఉంటే…
కాస్త తగ్గించండి… ఎక్కువ వాడితే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.ఇందులో ఓక్సాలేట్ క్రిస్టల్స్ ఉంటాయి.. ఇవి బాడీలోకి వెళ్లి కాల్షియంతో కలిసి… కాల్షియం ఓక్సాలేట్ బాండ్స్ ఏర్పరుస్తాయి.
చాక్లెట్లని కూడా అతిగా తీసుకోవద్దు చాక్లెట్లలో ఆక్సలేట్ ఉంటుంది. ఇది తిన్నా సమస్యలు తప్పవు
టమాటాలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి..టొమాటో గింజల్లో ఆక్సలేట్ ఉంటుంది. ఇది ఆహారానికి టేస్టును ఇస్తుంది.
కిడ్నీలకు రాళ్లను ఉచితంగా ఇస్తుంది.
సముద్ర ఆహారంలో ప్రత్యేక పారినిస్ ప్రచూర్ పదార్థాలుంటాయి. సముద్ర చేపలు, ఇతర ఆహారాలు డైలీ తింటే యూరిక్ యాసిడ్ ఎక్కువగా బాడీలో చేరుతుంది. ఇది కిడ్నీల్లోకి వెళ్లి రాళ్లుగా మారుతుంది, అందుకే జర జాగ్రత్త.