రోజుకి ఎన్ని సార్లు బ్రష్ చేయాలి – రాత్రి బ్రష్ చేయాలా వద్దా నిపుణుల సలహా

రోజుకి ఎన్ని సార్లు బ్రష్ చేయాలి - రాత్రి బ్రష్ చేయాలా వద్దా నిపుణుల సలహా

0
149

మనం నిత్యం ఉదయం మాత్రమే బ్రష్ చేస్తాం, అయితే కొందర రెండు పూట్ల చేస్తారు మరికొందరు నోటిలో ఏదైనా ఆహారం తింటే వెంటనే బ్రష్ పేస్ట్ పట్టుకుని పళ్లు తోమేస్తారు, అసలు వైద్యులు నిపుణులు ఏమి చెబుతున్నారు ఎప్పుడు బ్రష్ చేస్తే మంచిది అనేది ఓసారి చూద్దాం.

 

భోజనం ముగించిన ప్రతి సారీ బ్రష్ చేయడం మనలో కొంత మందికి అలవాటు.. జస్ట్ నోటిలో నీరు వేసుకుని పుక్కలించండి సరిపోతుంది.. అంతేకాని ప్రతీసారి బ్రష్ చేయక్కర్లేదు, ఇక ఉదయం లేచిన వెంటనే ఓసారి రాత్రి భోజనం చేసిన తర్వాత ఓసారి మాత్రమే చేయండి.ఇక మినిమం ఓ అరగంట గ్యాప్ తీసుకుని చేయాలి.

 

ఎక్కువ సార్లు బ్రష్ చేసినా.. ఎక్కువ సేపు పళ్లు తోమినా.. పళ్ల పైపొర ఎనామిల్ దెబ్బతింటుంది. ఇలా చేయడం వల్ల చిగుళ్ల సమస్యలు కూడా వస్తాయి.ఇక మీకు ఎలాంటి బ్రష్ సెట్ అవుతుందో చూడండి, హార్డ్ సాఫ్ట్ బ్రిసిల్స్ చూసుకుని మీకు ఏది సెట్ అవుతుందో అది వాడండి. ఇక మీరు కాఫీ టీ డ్రింకులు మానేస్తే బెటర్, ఒకవేళ తాగితే మాత్రం కచ్చితంగా బ్రష్ సాఫ్ట్ గా చేయండి.