వాన నీటిలో నడుస్తున్నారా? అయితే ప్రమాదం పొంచి ఉన్నట్టే..!

0
126

తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక చోట్ల వర్షపు నీరు రోడ్లపైనే నిలిచిపోవడంతో చాలామంది ఆ నీటిలో నుంచే నడిచి వెళ్తున్నారు. కానీ వాన నీటిలో నడవడం ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే రకరకాల ప్రదేశాల నుంచి వచ్చి చేరే ఆ కలుషిత నీటిలో నడవడం ద్వారా హానికారక వైరస్​ శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది.

ముఖ్యంగా లెప్టోస్పైరోసిస్ అనే వ్యాధి బారిన పడే అవకాశం అధికంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి సోకినవారు 24 నుంచి 72 గంటల వ్యవధిలో వైద్యుడిని సంప్రదించడం మేలని వెల్లడించారు. లెప్టోస్పైరా అనే సూక్ష్మజీవిని అనేక జంతువులు తీసుకొస్తాయి. ఈ వ్యాధికి ప్రత్యేక వ్యాధి లక్షణాలు ఏమీ ఉండవు.

కానీ వర్షాకాలంలో జ్వరం వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి వైద్యుల సలహా మేరకే తగిన మందులు వాడాలి. వర్షాకాలంలో లెప్టోస్పైరోసిస్​తో పాటు మరెన్నో వ్యాధులు సోకే ప్రమాదముంది. అవేంటంటే..మలేరియా, డయేరియా,కలరా, పారాసైటిక్ క్రిప్టోస్పోరీడియం, డెంగ్యూ, చికున్​ గున్యా,  శ్వాస సంబంధ ఇన్ఫెక్షన్లు, చర్మ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.