పసుపు పంటలో ఆకుమచ్చ తెగులు సమస్య..తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

0
39

పసుపు పంట భారతదేశపు వాణిజ్య పంట. ఒకప్పుడు పసుపుకు ఉన్న గిరాకీ మరే పంటకు లేదు. రైతులు గతంలో పసుపు మార్కెట్ కు తీసుకెళ్లి ఎన్ని క్వింటాళ్లు అయితే అన్ని తులాల బంగారం తెచ్చుకునేవారు. ఆ రోజుల్లో పసుపుకు అంత డిమాండ్ మరి. కానీ ప్రస్తుతం పసుపుకు డిమాండ్ పడిపోయింది. దానితో పంట సాగు విస్తీర్ణం అంతంతమాత్రంగానే ఉంది. ఇక ఈ పంటకు అనేక రకాల వ్యాధులు సోకుతున్నాయి. అందులో ఒకటి ఆకుమచ్చ తెగులు లక్షణాలు..దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఆకుమచ్చ తెగులు లక్షణాలు..

శిలీంధ్రం పత్రదళంను కొన్నిసార్లు పత్రవృంతం పైన ఆశించి లక్షణాలను కలుగజేస్తుంది. ఆకుల పై దీర్ఘవృత్తాకార మచ్చలు వివిధ పరిమాణాలలో ఆకుకు రెండు వైపులా ఏర్పడును.

ఈ మచ్చలు క్రమేపి 4-5 సెం.మీ. పొడవు, 2-3 సెం.మీ. వెడల్పు పెరుగుతాయి.

ముదురు మచ్చల పై తెల్లని బూడిద రంగు మచ్చలు మధ్యలో ఉండి చుట్టూరా పసుపు రంగు వలయం ఉంటుంది.

మచ్చల మధ్య బాగం పల్చగా తయారవుతుంది.
తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మచ్చలన్నీ కలిసిపోయి ఆకులు ఎండిపోయి మొక్కలు వేలాడ బడుతుంది.

వ్యాప్తి..ఈ శిలీంధ్రం దుంపలలోనూ, పంట అవశేషాలలోనూ జీవించి గాలి ద్వారా వ్యాప్తి చెందును.
తెగులు నివారణ చర్యలు..

నివారణ:

తెగులు సోకిన ఆకులను ఏరి కాల్చివేయాలి.

విత్తన దుంపలను కాపర్ ఆక్సీ క్లోరైడ్25% మందు ద్రావణంలో 40 నిమిషాలు ముంచి నాటుకోవాలి.

తెగులు గమనించిన వెంటనే మాంకోజబ్25% లేదా కార్బండిజం 0.1% మందు 15 రోజుల వ్యవధిలో ఆగష్టు నుండి డిసెంబరు మాసాల మధ్య పిచికారి చేసుకోవాలి.

తెగులు తట్టుకొనే రకాలయిన టి.ఎస్. 2, టి.ఎస్. – 4, టి.ఎస్. – 79, టి.ఎస్. – 88 వంటి రకాలను విత్తుకోవాలి.

అప్పుడే ఈ తెగుళ్ల నుంచి విముక్తి కలుగుతుంది.. అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటుంది..