దేశమంతా ఆంక్షలు..కేంద్రం కీలక ప్రకటన

Sanctions across the country..Central key statement

0
92

దేశంలోని పలు రాష్ట్రాల్లో కొవిడ్-19​ వ్యాప్తి దృష్ట్యా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి విధించిన ఆంక్షలను నవంబరు 30 వరకు పొడిగిస్తున్నట్లు గురువారం తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్​ భల్లా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా పండుగ సీజన్‌తోపాటు కరోనా డెల్టా ఏవై.4.2 వేరియంట్ కలకలంతో మార్గదర్శకాలు పొడిగించారు.

థర్డ్ వేవ్ వస్తుందన్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుంది. అయితే దేశంలో ప్రతిరోజూ 10,000 నుంచి 20,000 కేసులు నమోదవుతున్నాయి. గురువారం నాటి బులెటిన్ ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 16,156 మంది కోవిడ్ సోకింది. కరోనాతో 733 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 33,614,434 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనాతో ఇప్పటి వరకు 4,56,386 మంది మరణించారు. ప్రస్తుతం 1,60,989 క్రియాశీల కేసులు ఉన్నాయి. భారతదేశంలో ఇప్పటి వరకు 100 కోట్ల కోవిడ్-19 టీకాలు ఇచ్చారు.

ప్రస్తుతం దేశంలో కరోనా డెల్టా ఏవై.4.2 వేరియంట్ కలకలం రేపుతోంది. కర్ణాటకలో తాజాగా ఏవై.4.2 వేరియంట్ కేసులు ఏడు నమోదయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వంతో పాటు, పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. తెలంగాణలో కూడా ఒక ఏవై 4.2 కరోనా వేరియంట్ కేసు నమోదైనట్లు తెలిపింది. అయితే.. ఈ కేసు 2021 జూన్ నెలలో నమోదైందని వెల్లడించింది. జూన్ నుంచి ఇప్పటి వరకు ఏవై 4.2 కేసులు నమోదు కాలేదంటూ వైద్యశాఖ స్పష్టం చేసింది.