ఈ మధ్య కరోనా సమయంలో అందరూ శానిటైజర్లు వాడుతున్నారు, అయితే ఈ వైరస్ తమకు వస్తుందా అనే భయంతో ప్రతీ ఒక్కరు పాకెట్ లో బాటిల్ పెట్టుకుంటున్నారు, అయితే ఇది చాలా ప్రమాదకరం శరీరంపై ఎక్కువగా శానిటైజర్ పడినా రాసినా అది బొబ్బలు రాషెస్ కు కారణం అవుతుంది.
అలాగే అన్నం తినే ముందు చేతులకి శానిటైజర్ రాసినా వెంటనే చేతులు కడుక్కోవాలి, అది శరీరంలోకి వెళితే పేగులు కుళ్లిపోతాయి. ఇక బండిపై శానిటైజర్ చల్లద్దు కారుల్లో కూడా ఎక్కువగా శానిటైజర్ ఉంచద్దు అంటున్నారు నిపుణులు.
ఇక స్విట్చ్ బోర్డులపై కూడా శానిటైజర్ పూస్తున్నట్లు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి, కరెంట్ ప్లగ్స్ బోర్డులపై శానిటైజర్ కొట్టద్దు. బోర్డులకి స్విచ్చులకి శానిటైజర్ దూరంగా ఉంచండి. ఇక రాషెస్ సమస్య ఉన్న వారు వాడకపోవడం మేలు అంటున్నారు వైద్యులు.