శానిటైజర్ వాడుతున్నారా .. బి కేర్ ఫుల్ బ్రదరూ …

శానిటైజర్ వాడుతున్నారా .. బి కేర్ ఫుల్ బ్రదరూ ...

0
89

కరోనా మహమ్మారి రాకముందు శానిటైజర్ ల వాడకం చాల తక్కువగా ఉండేది . కానీ ఇప్పుడు మాత్రం వీటికి ఫుల్ డిమాండ్ పెరిగింది . చాల మంది వీటిని విపరీతంగా వాడేస్తున్నారు. అయితే ఈ శానిటైజర్ ల విషయం లో జాగ్రత్తగా ఉండమని చెబుతుంది కన్స్యూమర్ గైడెన్స్ సొసైటీ అఫ్ ఇండియా .

అయితే ఈ సంస్థ ఈ మధ్య ఇచ్చిన నివేదిక ప్రకారం కొన్ని రకాల శానిటైజర్ లలో మిథైల్ ఆల్కహాల్ ఉన్నట్లు వారు గమనించారు . వారు పరీక్షించిన 122 శాంపిల్స్ లో 5 రకాల శాంపిల్స్ లో విషపూరిత పదార్థాలని వాడినట్లు వారు తెలియజేసారు .

మామూలు శానిటైజర్ కి , మిథైల్ ఆల్కహాల్ వదిన శానిటైజర్ కి చాల తేడా ఉంటుంది .. ఈ శానిటైజర్ నుండి వచ్చే వాసన కూడా విచిత్రంగా ఉంటుంది . అయితే మిథైల్ ఆల్కహాల్ ఉన్న శానిటైజర్స్ వాడటం వాళ్ళ కొన్ని రకాల నరాలు పనిచేయక అంధత్వం వచ్చే అవకాశం ఉన్నట్లు సీజీఎస్సై నివేదిక సమర్పించింది . ప్రజలు వాడే శానిటైజర్ ల పట్ల జాగ్రతగా ఉండాలని ఆ సంస్థ సూచించింది .