షాక్- మళ్లి పెరిగిన ధరలు..కారణం ఇదే!

0
101

సామాన్య ప్రజలపై మరింత భారం పడనుంది. కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల గతంతో పోలిస్తే ఆదాయం తగ్గడంతో సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ప్రజల కొనుగోలు శక్తి భారీగా తగ్గినా నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం భగ్గుమంటున్నాయి. అందులో ముఖ్యంగా వంట నూనెల సరఫరా దేశంలో భారీగా పడిపోవడంతో మార్కెట్లో వంట నూనె ధరలు పైపైకి పోతున్నాయి.

ఉక్రెయిన్‌-రష్యా యుద్దం కారణంగా వంట నూనెల దిగుమతులు పడిపోయాయంటున్నాయి వంట నూనెల కంపెనీలు. సుమారు 80 శాతం మేర సన్ ఫ్లవర్‌ క్రూడాయిలును ఉక్రెయిన్‌, రష్యాల నుంచే దిగుమతి చేసుకుంటున్న ఇండియా… యుద్దం కారణంగా షిప్‌మెంట్‌లు లేకపోవడంతో దిగుమతులు పడిపోయాయి. జనవరిలో సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ సరఫరా 307684 టన్నులుంటే.. ఫిబ్రవరిలో 140000 టన్నులకు దిగుమతులు మాత్రమే పడిపోయాయంటోన్నాయి మార్కెట్‌ వర్గాలు.

మార్చి నెలలో 140000 టన్నుల కంటే తక్కువగానే దిగుమతులయ్యే అవకాశం ఉంది. సన్‌ఫ్లవర్‌ దిగుమతులు నిలిచిపోవడంతో పామాయిల్‌ నూనెలకు డిమాండ్‌ పెరిగింది. మరింత పామాయిల్‌ కోసం ఇండోనేషియా, మలేసియా దేశాల నుంచి దిగుమతికి ప్రయత్నాలు చేస్తున్నారు. జనవరితో పోల్చుకుంటే ఫిబ్రవరి నెలలో 22 శాతం మేర పడిపోయాయి వెజిటబుల్‌ ఆయిల్‌ దిగుమతులు. పరిస్థితి ఇలాగే ఉంటే వంట నూనెల సరఫరా మరింత కష్టమవుతుందంటున్నారు వ్యాపారస్తులు. పది రోజుల క్రితంతో పోలిస్తే అన్ని రకాల వంట నూనెల ధరలు సరాసరి రూ. 20 నుంచి రూ. 30 వరకు పెరిగాయి.