పెరుగు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలా? అయితే ఈ చిట్కాలు పాటించండి..

0
47

పెరుగును చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే కొంతమంది పెరుగును తినడానికి అస్సలు ఇష్టపడరు. ఇక భోజనం ముగింపు పెరుగుతో చేయకపోతే తిన్నట్టు అనిపించదు. మరి పెరుగు తాజాగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. కానీ పెరుగు ఒకటి రెండు రోజుల్లో చెడిపోతుంది లేదా పుల్లబడుతుంది. మరి పెరుగు ఫ్రెష్ గా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తేమ, గాలి తగలని చోట పెరుగును నిల్వ చెయ్యాలి. గాలి చొరబడని కంటైనర్లు ఆహారాన్ని ఎక్కువ రోజులు తాజాగా ఉంచుతాయి. పెరుగును కూడా ఇలా కంటైనర్లలో నిల్వ చేయవచ్చు. కంటైనర్‌ నుంచి పెరుగును తీసుకున్న ప్రతిసారి కంటైనర్ మూతను గట్టిగా మూసివేయడం మాత్రం మర్చిపోకూడదు.

ఫ్రీజ్‌లో పెరుగును నిల్వ చేయడం వల్ల అందులో సూక్ష్మజీవులు చేరకుండా నిరోధించవచ్చు. కాలుషితమైన నీరు హానికరమైన బ్యాక్టీరియా పెరగడానికి దారి తీస్తుంది. ఫలితంగా ఆహారం పాడవుతుంది.

చాలా మంది పాల ప్యాకెట్‌ నుంచి తీసిన పాలతో తయారు చేసిన పెరుగును ఇళ్లలో వినియోగిస్తుంటారు. ఈ పెరుగును తోడు పెట్టిన గిన్నెలోనుంచే నేరుగా తింటుంటారు. ఇది సరైన పద్ధతికాదు. పెరుగు గిన్నెలో నుంచి స్పూన్‌తో కావల్సిన మేరకు వేరే గిన్నెలోకి తీసుకుని, పెరుగు గిన్నెలో తిరిగి ఫ్రిల్‌ పెట్టాలి. ఐతే పెరుగు తీసుకోవడానికి ఉపయోగించే స్పూన్‌ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.