చాలా మందికి హెయిర్ లాస్ అనేది పెద్ద సమస్య.. ఇది లక్షలాది మందిని వేధిస్తోంది.. ఇంకా 25 ఏళ్లు రాలేదు అప్పుడే జుట్టు ఊడిపోతోంది అని చాలా మంది బాధపడుతూ ఉంటారు… అయితే మనం తినే తిండి వల్ల కూడా ఇలా జుట్టు ఊడిపోతుంది అనేది గుర్తు ఉంచుకోండి. జుట్టుకు అవసరమైన పోషకాహారాన్ని అందించే ఆహారం మీరు తప్పని సరిగా తీసుకోవాలి.
జుట్టు బాగా రాలుతోంది అంటే మీరు పోషకాలు ఉన్నా ఆహారం తీసుకోవడం లేదు అని కూడా అర్దం… మరి ఏది తింటే మంచిది ఏది తినకపోతే బెటర్ అనేది చూద్దాం.
ముందు మీరు కాఫీ టీలు తాగద్దు
స్వీట్లు వారానికి తిన్నా పర్వాలేదు కాని రోజూ తినవద్దు
పంచదార ఎంత తక్కువ తింటే అంత జుట్టు బాగుంటుంది పంచదార అవాయిడ్ చేయండి
శుద్ధి చేసిన పిండి, ప్రాసెస్ చేసిన ఫుడ్
అస్సలు మందు తీసుకోవద్దు బీరు విస్కీ వోడ్కా ఇలా ఏదీ తీసుకోవద్దు
సోడాలు కూల్ డ్రింకులు పంచదార వేసిన జ్యూస్ లు తాగద్దు
జంక్ ఫుడ్ అస్సలు వద్దు
నూనెలు ఎక్కువ ఉన్న పదార్థాలు, ఫ్రై లు, బజ్జీలు, నూనెతో చేసిన ఆహర పదార్దాలు మానేయండి
హెల్మెట్ పెట్టుకుంటున్నారా కచ్చితంగా మీరు దానిని నీట్ గా తుడిచి పెట్టుకోండి
ఇక ఎండలో తిరిగినా కర్చీఫ్ టోపీ పెట్టుకోవాలి తలకి
ఇలా జాగ్రత్తలు తీసుకుంటే హెయిర్ లాస్ తగ్గుతుంది.
|
|
|
జుట్టు ఊడిపోతోందా అయితే ఈ ఫుడ్ కి దూరంగా ఉండండి
-