సిగరెట్ తాగే వారి పక్కనే ఉంటున్నారా..అయితే తస్మాత్ జాగ్రత్త

Stay by the side of those who smoke cigarettes..but beware Tasmat

0
109

పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ పొగ తాగేవారు మాత్రం మానడం లేదు. వారు అనారోగ్యం పాలు అవడమే కాకుండా పక్కవారికి ఇబ్బంది కలిగిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో సిగరెట్ తాగేవారు పెరిగిపోయారు.

సిగరెట్ తాగడం అనేది నేటి రోజుల్లో ఒక ట్రెండ్‎గా మారిపోయింది. ఒకప్పుడు వృద్ధ వయసు వారు మాత్రమే పొగ తాగే వారు. దీంతో చిన్నల నుంచి పెద్దల వరకు కూడా ప్రతి ఒక్కరూ సిగరెట్ తాగుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అయితే సిగరెట్ తాగుతున్న వారు వారి ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకోవడమే కాదు పక్కన ఉన్న వారి ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారని నిపుణులు చెబుతూనే ఉన్నారు.

సిగరెట్ తాగుతున్న వారి పక్కన ఉన్న వారు ఆ పొగను పీల్చడం వల్ల వారు కూడా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. సాధారణంగా ఎవరైనా సిగరెట్ తాగుతుంటే పక్కనున్న వారు ఎవరో సిగరెట్ తాగితే మనకు ఏమవుతుందిలే అంటూ అనుకుంటారు. అలా అనుకుంటే పొరపాటే ఎందుకంటే పక్కన ఎవరో సిగరెట్ తాగుతున్నప్పటికీ అతను బయటకు వదిలే పొగ పీలిస్తే పక్కవాళ్ల ఆరోగ్యానికి కూడ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఇది మరింత ప్రమాదకరంగా ఉంటుంది.

చిన్నప్పుడు ఇతరులు వదిలిన సిగరెట్ పొగను పీల్చడం వల్ల ప్రభావానికి గురైన ఆడపిల్లల్లో పెద్దయ్యాక కీళ్ల నొప్పులు, తలనొప్పి ఎక్కువగా ఉంటుందని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. అందుకే సిగరెట్ తాగేవారి పక్కన ఉండకపోవడం ఎంతో మంచిదని అంటున్నారు నిపుణులు.