మీలో ఈ లక్షణాలు కనిపించినట్లయితే ఫోన్ వాడడం మానేయండి!

0
116

ఈ రోజుల్లో ఫోను వాడని వారు ఎవరు లేరు. అది మన నిత్యజీవితంలో ఓ భాగం అయిపోయింది. ఇంతకుముందు పొద్దున్నే లేవగానే  దేవుడు ఫొటో చూసేవారు..కానీ ఇప్పుడు మాత్రం లేవడంతోనే ఫోన్ చూస్తున్నారు. ప్రస్తుతం స్మార్ట్ వినియోగించే వారి సంఖ్య భారీగా పెరిగింది. యువ‌కులు, చిన్నారుల నుంచి మొదలు పెద‌వాళ్ల వ‌ర‌కు అంద‌రూ స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. రోజుకో కొత్త మోడ‌ల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. పెద్దలను చూసి పిల్లలు తండ్రిని మించిన తనయుడు అన్నట్టుగా ఫోన్ వాడుక పిల్లలల్లో అధికంగా పెరుగుతుంది.

ముఖ్యమైన కాల్స్, నోటిఫికేషన్స్ వచ్చినపుడు చూస్తే తప్పులేదు. మనం చేసే జాబ్, బిజినెస్ కు ఫోన్ చాలా అవసరం. మనం ఫోన్ అవసరమైన సమయంలో వాడితే ఎలాంటి నష్టాలు కలగవు. మనం దేన్ని అయినా.. సరిగ్గా వాడుకుంటేనే మంచి లాభాలు పొందుతాం. అధికంగా వాడడం వల్ల మనకు చాలా  నష్టాలు జరుగుతాయి.  ఎంతవరకూ వాడాలో తెలిసినప్పుడు ఫోన్ వాడటంలో తప్పు లేదు. మీ శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తే వెంటనే ఫోన్ వాడకపోవడం మంచిదని నిపుణులు చూచిస్తున్నారు. .

ఏదైనా వస్తువును పట్టుకున్నప్పుడు మణికట్టు నొప్పి అవుతుంది. ఇది ఫోన్ అతి వాడకం ఎఫెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఫోన్ ఎలక్ట్రానిక్ వస్తువు. దీనిని ఎక్కువగా పట్టుకుని ఉండడం వలన మణికట్టులో తిమ్మిరి, నొప్పి వస్తుంది. అలాగే మణికట్టులో జలదరింపు (వైబ్రెషన్) వస్తుంది. ఇది కార్పల్ టన్నెల్.. మణికట్టుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మణికట్టు తిమ్మిరిగా ఉన్నా.. నొప్పి కలిగిన వెంటనే ఫోన్ పక్కన పెట్టండి

మన ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యం. అందుకే రాత్రిళ్లు మొబైల్ ఉపయోగించడం తగ్గించాలి. అతిగా మొబైల్ వాడడం వలన నిద్రలేమి సమస్య వస్తుంది. ఫలితంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఫోన్ లో ఏదైన చదడవం.. ఎక్కువ సేపు ఉపయోగించడం వలన ఒత్తిడి పెరుగుతుంది. అలాగే నిద్రలేమి సమస్య.. కోపం, చిరాకు తొందరగా రావడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం జరుగుతుంది. అందుకే అలసటగా ఉన్నప్పుడు ఫోన్ అస్సలు ఉపయోగించకూడదు.

మొబైల్‍ను ఎక్కువగా ఉపయోగించడం వలన కళ్లపై ఒత్తిడి పడుతుంది. క్రమంగా ఇది కంటి చూపును దెబ్బతీస్తుంది. కళ్లు మన శరీరంలోనే అతి సున్నితమైన భాగం. ఫోన్ బ్లూ స్క్రీన్ కళ్లపై పడి కంటి చూపును దెబ్బతీస్తుంది. కంటి నొప్పి, తలనొప్పి, కళ్లు పొడిబారినట్లుగా అనిపించినప్పుడు వెంటనే ఫోన్ పక్కన పెట్టండి..

ముఖంపై మొటిమలు రావడానికి కూడా ఫోన్ కారణమవుతుందని మీకు తెలుసా అమ్మాయిలూ… ఫోన్ స్క్రీన్ వలన హానికరమైన కిరణాలు ముఖంపై పడతాయి.. అందులోని బ్యాక్టీరియా చర్మంపైకి వస్తుంది. దీంతో పగుళ్లు, మచ్చలు, మొటిమలు రావడం జరుగుతంది. అంతేకాకుండా.. అకాల వృద్దాప్యానికి కూడా కారణమవుతుంది. అందుకే మొబైల్ ప్రతిరోజూ వైప్ లతో శుభ్రం చేయాలి. రాత్రిళ్లు లైట్ ఆపేశాక..బెడ్ షీట్ ముసుగులో ఫోన్ అస్సలు వాడొద్దు..ఆ ఫోన్ లైటింగ్ ఫోన్ మీద డైరెక్టుగా పడుతుంది..ఫేస్ మొత్తం కరాబ్ అవుతుంది.

ఇలా ఏమైనా ఇబ్బందులు మీకు కలిగినప్పుడు ఫోన్ వాడకం కాస్త తగ్గించండి. మొండిగా ఆ టైంలో కూడా ఫోన్ వాడితే..లేనిపోని అనారోగ్య సమస్యలు కొని తెచుకున్నట్టే..