కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన దీక్ష..అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాల భర్తీ: రేవంత్

0
38

టీపీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. సమయం దొరికినప్పుడల్లా టిఆర్ఎస్ సర్కార్ పై మండిపడుతూనే ఉన్నారు. అలాగే ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్ కు లేఖ రాసి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. తాజాగా నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీలను భర్తీ చేయాలని యువజన కాంగ్రెస్ ఈ దీక్షను నిర్వహించింది. నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు.

ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..ఆనాడు తెలంగాణ నిరుద్యోగుల హక్కులని ఇందిరాగాంధీ కాపాడారు. చిన్నారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నేను గోడల మీద రాతలు రాసాను. యూత్ కాంగ్రెస్ లో కొట్లాడిన వాళ్ళకే టికెట్లు వస్తాయి. మధ్యలో వచ్చిన టిఆర్ఎస్ తెలంగాణకి మెము ఓనర్లం అని చెప్పుకుంటున్నారు. యువకుల జీవితాలతో కెసిఆర్ చెలగాటం అడుతున్నారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు కంటే నాకు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంటేనే ఇష్టం. నేను యూత్ కాంగ్రెస్ కి అధ్యక్షుడు అయుంటే కెసిఆర్ కు గునపం గుచ్చేవాడిని. బిస్వాల్ కమిటీ లక్ష తొంబై వేల ఉద్యోగాలు కాలిగా ఉన్నాయని చెపింది. అసెంబ్లీ సాక్షిగా కెసిఆర్ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి 8 సంవత్సరాలు అయింది. హరీష్ రావు నీకు నీ పార్టీకి ఉద్యోగాలు వచ్చాయి. నిరుద్యోగులకి ఉద్యోగాలు రాలేదు.

ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఇప్పటివరకు తీసేయలేదు. కాంగ్రెస్ పార్టీ 12 నెలల్లో అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తం. అందుకోసం అవసరమైతే సోనియాగాందీ కాళ్ళు పట్టుకుంటాను. గోల్కొండ కోటపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం. ప్రగతి భవన్ ని అంబెడ్కర్ భవన్ గా మారుస్తూ మొదటి సంతకం పెడతాం. కెసిఆర్ మగాడు అయితే తెలంగాణ ప్రభుత్వాన్ని రద్దు చెయ్. మెము యుద్దానికి సిద్దంగా ఉన్నం. కెసిఆర్ నీకు చేత కాకా ప్రశాంత్ కిశోర్ ని తెచ్చుకున్నావని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.