జలుబుతో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి..

0
104

ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఎందుకంటే ‘ఆరోగ్యమే మహాభాగ్యం’. అనారోగ్యం ధరిచేరితే ఇక ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ..ఉన్న ఆస్తుపాస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. ఇక ప్రస్తుతం వానాకాలం సీజన్. ఈ కాలమే వ్యాధుల మయం. ఈగలు, దోమలు ఈ రోగాలకు ప్రధాన కారణం.

అయితే మనకు జలుబు చేస్తే మాత్రం పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. వారం రోజులు పాటు  ఇబ్బందులు ఎదుర్కొవాల్సింది. ఈ మాయదారి కరోనా వచ్చినప్పటి నుండి జలుబు అంటేనే జనం జంకుతున్నారు. అయితే సీజనల్ వ్యాధులు సహా రోగనిరోధక శక్తి ఈ చిట్కాలు పాటించండి..

వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ గుణాలు ఉంటాయి. అందువల్ల పూటకు ఒకటి చొప్పున వెల్లుల్లి రెబ్బను తింటుంటే జలుబు త్వరగా తగ్గుతుంది.

నారింజ పండ్లలో ఉండే విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు జలుబును త్వరగా తగ్గిస్తాయి.

పుట్టగొడుగులు మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో జలుబుకు కారణమయ్యే వైరస్‌ల ప్రభావం తగ్గి, జలుబు తగ్గుతుంది.

పసుపు, అల్లం రసం, గుమ్మడికాయ విత్తనాలు, క్యారెట్లు, చికెన్‌ సూప్‌ తీసుకోవడం వల్ల కూడా జలుబును త్వరగా తగ్గించుకోవచ్చు.

మిరియాలు, బెల్లం, పెరుగు కలిపి తీసుకుంటే ముక్కు దిబ్బద త్వరగా తగ్గి జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.

జాజికాయ పొడి, అల్లం, కుంకుమ పువ్వును పాలల్లో వేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుది.

చింతపండు గుజ్జు, టమాట రసం, మిరియాల పొడి, ఒక ఎండు మిర్చి, కొంచెం ఉప్పు కలిపి సూప్‌ మాదిరిగా చేసుకుని వేడివేడిగా తాగితే జలుబు ముక్కు కారడం ఆగుతుంది.