ముఖంపై ముడతలతో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి..

0
156

అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. మరీ ముఖ్యంగా మహిళలు అందంగా ఉండాలని ముఖానికి వివిధ రకాల క్రీమ్ లు, పౌడర్లు వాడుతుంటారు. ప్రస్తుతం ఎక్కువ మంది మహిళలను మొటిమల సమస్య వేధిస్తుంది. మొఖం మీద మొటిమలతో, ముడతలతో నలుగురిలో కలిసి తిరగడానికి మొహమాటం పడుతుంటారు. మరి మొఖంపై ముడతలను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మన ఆరోగ్యానికి కారణం పోషకాహారం. మంచి ఆహరం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. లేదంటే రోగాల బారిన పడతాం. చర్మం ముడతలు పడడానికి కారణం తీసుకునే ఆహారమే. మన శరీరానికి అన్ని రకాల పోషకాహారం అవసరమైనప్పటికీ కొన్ని ఆహర పదార్ధాలు శరీరానికి, చర్మానికి హాని కలిగిస్తాయి. అయితే వయసుతో పాటు వచ్చే ముడుతలతో చర్మం ప్రకాశం తగ్గిపోతుంది.

ముఖ్యంగా స్నాక్స్, స్వీట్స్, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మానికి ముడతలు పడుతాయి. వీటిలో ఉన్న ఫ్రీ రాడికల్స్ వల్లే ఈ సమస్య తలెత్తుతుంది. అయితే వెన్న తీసుకుంటే కొంతమేర ముడతలు తగ్గుతాయి. ఆలివ్ ఆయిల్ కూడా చర్మానికి మంచి చేస్తుంది. దీనితో చర్మంపై ముడతలను తగ్గించుకోవచ్చు.