పాదాల వాపుతో బాధపడుతున్నారా? అయితే ఇదిగోండి చిట్కాలు..

0
139

అప్పుడప్పుడు మన శరీరంలో కొన్ని భాగాలు వాపులకు గురవుతూ ఉండడం మనం గమనిస్తుంటాము. ముఖ్యంగా వీటిలో పాదాలవాపులు చాలామందిని ఇబ్బందిపెట్టే సమస్య. ఇలా పాదాలవాపులు అనేవి అనేక కారణాల వలన రావచ్చు. ఇన్ఫెక్షన్లు, గాయాలు, కిడ్నీ సమస్యలు, కీళ్ల నొప్పులు వంటి పలు కారణాల వలన కూడా పాదాలు వాపు వస్తాయి.

అందుకే ఈ పాదాలు వాపు సమస్యను దూరం చేసుకోవడానికి ఒక్కసారి ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేసి చూడండి..పాదాల వాపును తగ్గించుకోవడానికి పుచ్చకాయలు బాగా సహాయపడతాయి. ఈ కాయలో 92 శాతం నీరు, డయో రేటిక్ పదార్థాలు ఉంటాయి. కావున పాదాల వాపు ఉన్నవారు ప్రతిరోజు ఒక కప్పు పుచ్చకాయ ముక్కలను తింటే మంచి ఫలితం ఉంటుంది.

ధనియాలు కూడా పాదాల వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఒక కప్పు నీటిలో రెండు స్పూన్ల ధనియాలు వేసి నీరు సగం అయ్యేవరకు బాగా మరిగించాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని వడకట్టి చల్లార్చుకోవాలి. ఇలా చేసిన మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు  త్రాగడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి.