షుగర్ వ్యాధి వస్తోంది అనడానికి ఈ లక్షణాలు కనిపిస్తాయి

షుగర్ వ్యాధి వస్తోంది అనడానికి ఈ లక్షణాలు కనిపిస్తాయి

0
90

షుగర్ వ్యాధి వచ్చిందంటే నరకమే, ఏ పని చేయలేము, అలసట, అలాగే ఏ స్వీట్ తినలేము అతిగా ఏ ఫుడ్ తీసుకోకూడదు.. ఇలా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి, ఆహారపు అలవాట్లు పూర్తిగా మార్చుకోవాలి, అందుకే షుగర్ సమస్య రాకుండా జాగ్రత్త పడాలి, ముందు టెన్షన్ అనేది ఉండకూడదు, అలాగే భారీ ఊబకాయం లేకుండా చూసుకోవాలి.

డయాబెటీస్కు సంబంధించిన కొన్ని లక్షణాలను తప్పకుండా తెలుసుకోవాలి. మరి ఆ లక్షణాలు ప్రాధమికంగా ఏం కనిపిస్తాయి అనేది తెలుసుకుందాం.

చేతులు, కాళ్లు, పాదాలు, ముంజేతులు వద్ద బొబ్బలు ఏర్పడతాయి, ఇలాంటివి వచ్చి తగ్గకుండా ఉన్నా నొప్పి లేకుండా ఉన్నా ఇది ప్రాధమిక సూచన అని చెబుతున్నారు నిపుణులు.అలాగే చర్మంపై పసుపు, ఎరుపు లేదా గోదుమ రంగు మచ్చలు, ఇక మెడ దగ్గర నల్లటి మచ్చలు వచ్చినా తగ్గకుండా సురీడుకాయల్లా చిన్నగా వస్తూ ఉన్నా ఇది ఓ లక్షణం, చర్మం విపరీతమైన దురదపుట్టినా అస్సలు తగ్గకపోయినా ఇది కాస్త అనుమానించాల్సిందే….అలాగే ఏదైనా గాయం తగిలితే అస్సలు తగ్గకుండా పుండు పుడుతోంది అంటే షుగర్ సమస్య కింద అనుమానించాల్సిందే.

గమనిక…
అయితే చాలా మందికి ఈ లక్షణాలు కనిపించడంతో వైద్యులు ఇవి చెబుతున్నారు, ఇవి ఉన్నంత మాత్రాన షుగర్ అని భావించవద్దు, వైద్యులని సంప్రదించి మీ అనుమానం నివృత్తి చేసుకోండి.