ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయం – 4500 టీమ్ లు రెడీ

ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయం - 4500 టీమ్ లు రెడీ

0
33
CM Jagan

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పలు సంక్షేమ పథకాలతో అభివృద్ది పథంలో ముందుకు దూసుకుపోతున్నారు.. పేదలకు అన్నీ పథకాలు ఇంటికి అందుతున్నాయి, ఏపీలో లంచాలు లేని వ్యవస్ధని నిర్మిస్తున్నారు. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది జగన్ సర్కారు.

ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూములన్నింటినీ రీసర్వే చేయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు.100 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు, ఇక దీని కోసం 4500 సర్వే టీమ్ లు సిద్దం అవుతున్నాయి.

ఈ సర్వే కోసం 1000 కోట్లు కేటాయించారు, అలాగే ఈ సర్వే ఎప్పుడుస్టార్ట్ అవుతుంది అంటే
2021 జనవరి నుంచి 2023 జూన్ నాటికి దశల వారీగా రీ సర్వే పూర్తి అవుతుంది..
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూమి హక్కు- భూమి రక్షణ అనే పేరు నిర్ణయించారు.ఇక ఎవరికి అయినా భూములు స్ధలాలు ప్లాట్ల విషయంలో వివాదాలు ఉంటే తక్షణ పరిష్కారం కోసం మొబైల్ కోర్టులు వస్తాయి.

ఇక గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కన్నబాబు వెల్లడించారు. ఫిజికల్ బౌండరీలను ఫిక్స్ చేస్తామని.. సర్వే రాళ్లను రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందని తెలిపారు, ఇది మంచి నిర్ణయం అని దీని వల్ల ఎలాంటి అవకతవకలు జరగవు అని అంటున్నారు మేధావులు విశ్లేషకులు.