ఈ 5 ఆహారాలను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోండి..ఎందుకంటే?

Take these 5 foods for breakfast..because?

0
38

ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే మనం నిద్రపోయే సమయంలో అంటే దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పాటు ఏ ఆహారాన్నీ తీసుకోం. దీనివల్ల శరీరం శక్తిని కోల్పోతుంది. దీన్ని తిరిగి తెచ్చుకోవడానికి అల్పాహారం తీసుకోవడం తప్పనిసరి. అయితే ఈ సమయంలో మనం తీసుకొనే ఆహారంలో ఇవి ఉండేటట్లు చూసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

అరటి పండ్లు:

ఉదయం పూట అల్పాహారం సమయంలో అరటి పండ్లు కూడా తీసుకుంటే మంచిది. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. బీపీ సమస్యలు తగ్గిస్తుంది. చూసారు కదా ఉదయం పూట ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని. మరి ఈ ఆహార పదార్థాలను తప్పకుండా ఉదయం పూట తీసుకుని ఆరోగ్యంగా ఉండండి. అలానే సమస్యలు లేకుండా ఆనందంగా ఉండండి.

ఓట్ మీల్:

ఓట్ మీల్ లో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. అలానే ఓట్ మీల్ లో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇందులో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి ఉదయాన్నే తీసుకుంటే మంచిది. షుగర్ కూడా పెరగకుండా ఉంటుంది.

గుడ్లు:

గుడ్లు కూడా ఉదయాన్నే తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. పిల్లలు కూడా రోజు గుడ్డు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అలానే గుడ్లని తీసుకోవడం వలన ఆరోగ్యం మరెంత బాగుంటుంది.

నట్స్ మరియు నట్స్ బట్టర్:

పీనట్ బటర్, హాజెల్ నట్ బటర్ ఇలాంటి వాటిని ఉదయం తీసుకుంటే మంచిది. అలాగే ఉదయం పూట నట్స్ తీసుకుంటే కూడా ఆరోగ్యం బాగుంటుంది. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం, పొటాషియం కూడా ఉంటాయి. కాబట్టి ఉదయం అల్పాహారం సమయంలో వీటిని తీసుకుంటే మంచిది.

కాఫీ:

అల్పాహారం సమయంలో కాఫీ ని తీసుకుంటే కూడా ఆరోగ్యం బాగుంటుంది. టైప్ 2 డయాబెటిస్ రిస్కు కూడా ఉండదు. గ్లూకోస్ మెటబాలిజం ని ఇంప్రూవ్ చేస్తుంది. అయితే కాఫీ తీసుకునేటప్పుడు పంచదార వేసుకోకండి. అలానే క్రీమ్ ని కూడా వేసుకోవద్దు.