కిడ్నీల్లో రాళ్లు కరిగిపోవాలంటే ఈ ఆహార పదార్థాలు తీసుకోండి..

0
36
3D Illustration von menschlichen Nieren mit Querschnitt

వేసవిలో చాలామంది అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్న పలు రకాల సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా సమ్మర్ లో కిడ్నీల సమస్యతో బాధపడేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. కావున ఈ సమస్య నుండి బయటపడాలంటే అధికంగా నీరు తాగాలి. కేవలం కిడ్నీల ఆరోగ్యం దెబ్బతినకుండా చేయడమే కాకుండా అనేక రకాల సమస్యలను కూడా మన దరికి చేరకుండా కాపాడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడిన ప్రారంభంలో సమస్యనూ కలిగించకపోయినా, వేసవిలో డీహైడ్రేషన్ కు గురైనప్పుడు వీటి పరిమాణం పెరిగి లక్షణాల రూపంలో సమస్య బయటపడుతుంది.

నిజానికి సోడియం, క్యాల్షియం, పొటాషియం, యూరిక్ యాసిడ్ అధికంగా ఉన్న ఆహారపదార్దాలను తీసుకోవడం వల్ల ఈ సమస్య అధికం అవుతుంది. అంతేకాకుండా అధిక బరువు ఉన్నవాళ్లలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. కావున అధిక బరువు తగ్గించుకోవడం మంచిది. కిడ్నీల్లో రాళ్లను కరిగించలేకపోయిన వాటిని బయటకు వెళ్లిపోయేలా చేసే మందులు ఉంటాయి. కాబట్టి డాక్టర్లను సంప్రదించి మందులను వాడడం వల్ల ఈ సమస్య నుండి ఉపశమనం పొందొచ్చు.

ఈ మందులను వాడడం వల్ల రాళ్లు కరగకపోయిన కిడ్నీ ఇన్ఫెక్షన్ మొదలైనా, కిడ్నీ పనితీరు తగ్గుతున్నట్టు కనిపించినా, రక్తంలో క్రియాటినిన్ మోతాదు పెరిగిపోతున్నా ఎండోస్కోపిక్ సర్జరీతో మూత్రపిండాల్లోని రాళ్లను తొలగించవలసి ఉంటుందని వైద్యులు చెబుతుంటారు. కిడ్నీల్లో రాళ్లు తగ్గిపోవాలంటే కిడ్నీ బీన్స్, ఆపిల్ సైడర్ వెనిగర్, ఎండబెట్టిన తులసి ఆకులు, ఎండబెట్టిన తులసి ఆకులు, సెలెరీ జ్యూస్, నిమ్మకాయ నీళ్ళు డాండెలైన్ రూట్, దానిమ్మ రసం తీసుకోవడం మంచిది. వీటిని మనరోజువారి ఆహారంలో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తే ఈ సమస్య నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది.