మనిషి కేవలం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా..మెదడు కూడా అంతే చురుగ్గా పనిచేయాలని అందరు కోరుకుంటారు. జీవితకాలం పెరుగుతున్న కొద్దీ మన మెదడుకు సంబంధించిన సమస్యలు అధికంగా పెరగడంతో పాటు..ఆరోగ్యం కూడా క్రమక్రమంగా క్షీనిస్తుంది. అందుకే ఎల్లప్పుడూ మెదడు చురుగ్గా ఉండాలంటే ఈ ఆహారపదార్దాలు మన రోజువారీ డైట్ లో ఉండేలా చూసుకోవాలి.
మెదడు చురుకుదనం తగ్గిపోవడం, మతిమరుపు రావడం, ఏకాగ్రత లోపించడం ఇలా ఎలాంటి సమస్యలకైనా చెక్ పెట్టాలంటే ఈ ఆహారపదార్దాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మెదడు చురుగ్గా ఉండాలంటే బాదాం, ప్రొద్దుతిరుగుడు విత్తనాలు,వాల్ నట్స్ లో ఉండే పాలీఫినాల్స్ మెదడులోని న్యూరాన్స్ ను,బ్రెయిన్ మధ్య కమ్యూనికేషన్ పెంచుతుంది.
రోజు కొన్ని వాల్ నట్స్ తినడం వల్ల మెమరీ పవర్ ను క్రమక్రమంగా మెరుగుపడుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు వీటిని తినడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా అవిసె గింజలను రోజూ తీసుకుంటే బ్రెయిన్ ఆలోచనాశక్తిని పెంచడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి.