ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భారీ జాబ్‌మేళా..100 ప్రముఖ కంపెనీలు హాజరు

0
41

కరోనా ప్రభావం తగ్గడం, పరిస్థితులు మళ్లీ చక్కబడడంతో ఉద్యోగాల నోటిఫికేషన్ లు కూడా ఊపందుకున్నాయి. జాబ్ మేళాలు సైతం జోరుగా నిర్వహిస్తున్నారు. తాజగా జగన్‌ సర్కార్‌ నిరుద్యోగులను అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో ఏపీలో భారీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే గుంటూరు, తిరుపతి, వైజాగ్‌ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జాబ్‌ మేళా నిర్వహించి నిరుద్యోగులను కొంతమేరకు ఆదుకోగా..తాజాగా ఏపీలో కూడా భారీ జాబ్‌మేళా నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 25న స్థానిక చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో 100 ప్రముఖ కంపెనీలతో మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు.ఈ నెల 11న రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో మెగాజాబ్‌ మేళా పోస్టర్‌ను ఆవిష్కరిస్తామని తెలిపారు.

ఈ భారీ జాబ్‌మేళాలో 300 మంది హెచ్‌ఆర్‌లు తమ ప్రతినిధులతో పాల్గొని ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల అర్హతలను బట్టి ఉద్యోగ ఎంపిక చేస్తామని తెలిపారు. అభ్యర్థులు వెబ్‌సైట్‌లో తమ పేర్లు నమోదు చేసుకుని డైరెక్ట్‌గా జాబ్‌మేళాలో పాల్గొని..ఉద్యోగాన్ని సాధించొచ్చు అన్నారు. ఈ అవకాశాన్ని అందరు వినియోగించుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని విజయసాయిరెడ్డి ఈ మేరకు తెలియజేసాడు.