ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు ఇవి కూడా తీసుకుపోయి ఆరోగ్యాంగా జీవించండి..

0
102

భానుడు నిప్పులు కుమ్మరించడంతో ప్రజలు ఉదయం 11 దాటితే అడుగు బయట పట్టే సాహసం ఎవ్వరు చేయలేకపోతున్నారు. అందుకే మనం ఎండాకాలంలో బయటకు వెళ్ళేటప్పుడు ఇవి మనతో పాటు తీసుకుపోతే ఎండ నుండి ఉపశమనం పొందొచ్చు. అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో మీరు చుడండి..

నీరు: వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడానికి తగినంత నీరు తీసుకోవడం ఎంతో అవసరం. అందుకే బయటికి వెళ్ళినప్పుడు నీరు ఖచ్చితంగా తీసుకుపోవాలి. అప్పుడప్పుడు తాగుతూ ఉండడం వల్ల శరీరం చురుగ్గా ఉండడమే కాకుండా..శక్తి కూడా పొందవచ్చు. అలాగే అలసట కూడా దూరమయిపోతుంది.

దానిమ్మ: వేసవిలో ఇంటి నుండి బయటకు వెళితే ఖచ్చితంగా దానిమ్మ గింజలను వెంట తీసుకెళ్ళాలి. దీనిలో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల ఎర్ర రక్తకణాలను అభివృద్ధి చేయడంలో తోడ్పడతాయి. ఇందులో ఉండే ఆక్సిడెంట్లు ఎండ నుండి మనల్ని రక్షిస్తుంది. ఇవే కాకుండా..ద్రాక్ష, అరటిపండు, డార్క్ చాక్లెట్ తీసుకెళ్ళడం వల్ల కూడా ఆరోగ్యానికి మంచివి.