బాడీ లో బి 12 విటమిన్ లోపిస్తే ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

0
44

మన బాడీ లో అన్ని విటమిన్ లలో బి 12 ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది లోపిస్తే అనేక వ్యాధులు శరీరాన్ని చుట్టుముడుతాయి. అంతేకాకుండా మన శరీరంలో అత్యంత ముఖ్య భాగమైన బ్రెయిన్ సంబంధిత సమస్యలకు గురయ్యే అవకాశం ఉందని ఆరోగ్య వైద్యులు చెబుతున్నారు. అందుకే కేవలం పిండిపదార్థాలు, కొవ్వులు, మాంసకృతులు మాత్రమే తీసుకోవడమే కాకుండా.. వీటితోపాటు విటమిన్లు, లవణాలు సూక్ష్మపోషకాలు కూడా బాడీకీ చాలా అవసరం.

మెదడు, నాడి వ్యవస్థ చక్కగా పనిచేయడానికి కారణమయ్యే ముఖ్య విటమిన్ బి 12. అంతేకాకుండా రక్తం తయారీలో బి 12 కూడా చాలా ఉపయోగపడుతుంది. అందుకే బి 12 లోపం అనేది శరీరంలో మెదడుకు రక్తానికి సంబందించిన సమస్యలకు దారితీస్తుంది. మన శరీరానికి తగినంత బి 12 లభించనప్పుడు జ్ఞాపకశక్తి తగ్గుముఖం పడుతుంది. అల్జీమర్స్ వంటి మతిమరుపు సమస్యలు కూడా మొదలవుతాయి.

బి 12 లోపిస్తే కండరాల బలహీనత, నిస్సత్తువ, నోటిలో పుండ్లు, మూత్రం ఆపుకోలేకపోవటం, శ్వాసలో ఇబ్బందులు, రక్తహీనత వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. అందుకే పాలు, పెరుగు, వెన్న, చేపలు, గుడ్లు, మాంసం, ఇలా జంతు సంబంధిత ఆహారాలలో బి 12 విటమిన్ అధికంగా లభించే అవకాశం ఉంటుంది. పాలు, పాల ఉత్పత్తుల్ని ఎక్కువగా తీసుకోవడాన్ని అలవాటు చేసుకుంటే మరి మంచిది.