ఖాళీ కడుపుతో ఈ ఆహారపదార్దాలు తీసుకుంటే ప్రాణానికే ప్రమాదమట..

0
106

చాలామంది తెలియక కాళీ కడుపుతో వివిధ ఆహారపదార్దాలను తీసుకుంటుంటారు. కానీ అలా తినడం అంటే ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. ముఖ్యంగా ఉదయం నిద్రలేడంతోనే టీ, కాఫీతో రోజును ప్రారంభించేవారు వారికి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా కాళీ కడుపుతో ఏ ఆహారపదార్దాలను తీసుకోకూడదో ఇప్పుడు చూద్దాం.

పరగడుపున టమోటాలు తీసుకోవడానికి ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే టమాటాల్లో ఉండే యాసిడ్స్ ఖాళీ కడుపులో చేరితే వికారం కలగడమేకాకుండా పేగుల్లో మంట లాంటి ఇబ్బందికరమైన చర్యలు జరుగుతాయి. ఖాళీ కడుపుతో ఆల్కాహాల్ తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే శరీరంలోని జీర్ణ వ్యవస్థ మొత్తం దెబ్బతిని పొట్ట నొప్పి, అధిక బరువు లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

ఇంకా పరగడపున అరటిపండ్లు కూడా తీసుకోకూడదట. ఎందుకంటే పరగడపున అరటిపండ్లు తీసుకోవడం వల్ల శరీరంలో ఉంటే మెగ్రీషియం లెవల్స్ ఒక్కసారిగా పెరిగి వివిధ సమస్యలకు దారి తీస్తుంది. అంతేకాకుండా సోడా, కూల్ డ్రింక్స్ వంటివి కూడా పరిగడుపున తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని చేకూరే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.