తెలంగాణ కరోనా అప్డేట్..కొత్త కేసులు ఎన్నంటే?

Telangana Corona update..what are the latest cases?

0
86
Covid-19 background. Stop spread and eliminate Coronavirus. Pandemics coronavirus. Epidemic backround. Healthcare background. Hands in blue medical gloves tearing the paper with covid-19 print

తెలంగాణలో కరోనా మహమ్మారి ఇంకా తగ్గలేదు. కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసులు నమోదు కానప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు కలవరం రేపుతున్నాయి. తాజాగా గడచిన 24 గంటల్లో 37,108 కరోనా పరీక్షలు నిర్వహించగా, 195 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 78 కొత్త కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 14, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి. 171 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 6,77,138 పాజిటివ్ కేసులు నమోదు కాగా..6,69,328 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,810 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 4,000కి పెరిగింది.