పోరుబాటలో తెలంగాణ మెడికల్ స్టాఫ్ : కారణాలివే

0
35

తెలంగాణ వైద్య సబ్బంది పోరుబాటకు సిద్ధమవుతున్నారు. రేపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలతో నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. సోమవారం 24 సంఘాలతో కూడిన వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘాల ఐక్యవేదిక(M&H OUF) ఆధ్వర్యంలో  కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ గారిని మరియు డైరెక్టర్ల ను ఐక్యవేదిక తరపున కలసి  వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా నేషనల్ హెల్త్ మిషన్ , కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, వేతనాలు పెంచాలని , వైద్య సిబ్బంది కుటుంబాలకు కోవిడ్ టీకాలు యుద్ధ ప్రాతిపదికన ఇవ్వాలని, కోవిడ్ తో చనిపోయిన వైద్య సిబ్బంది కుటుంబాలకు ఒక కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా, అలాగే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరడం జరిగింది.

ఐక్యవేదిక తరపున ఇచ్చిన వినతిపత్రం పై సానుకూల స్పందన రానందున  రేపు అనగా15th జూన్ మధ్యాహ్నం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ని పిహెచ్ సి, యుహెచ్ సి , హాస్పిటల్స్  మరియు అన్ని కార్యాలయాలు, అన్ని సెంటర్స్ వద్ద పెద్ద ఎత్తున భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు వ్యక్తం చేయాలని   ఐక్యవేదిక రాష్ట్ర ప్రనిధులు  పిలుపునిచ్చారు.

వైద్య సిబ్బంది  అందరూ కూడా ఈ నిరసన కార్యక్రమంలో  పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా   పత్రికా ప్రకటన ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర ప్రతినిధులు డాక్టర్ రవిశంకర్ ప్రజాపతి, డా. కత్తి జనార్దన్, భూపాల్ ,కర్నాటి సాయిరెడ్డి ,యాదనాయక్, డా. కిరణ్ ,వీరా రెడ్డి ,సుజాత ,శిరీష, రాజశేఖర్,కవిత, శివకుమార్, శ్రీనివాస్ రెడ్డి,సాధుల్ల ,కిషోర్, అనిత, నరేష్,కాంతం తదితరులు పాల్గొన్నారు.