30 ఏళ్లు అన్నంతినకుండా ఉన్న మహిళ రోజు ఏం తీసుకుంటుంది అంటే

-

ఎవరైనా సరే అన్నం తినకుండా ఉంటారా, పోని అన్నం తినకపోతే రొట్టె చపాతి ఏదో ఓ ఫుడ్ తీసుకుంటారు, మంచి నీరు తాగి బతికే వారిని చూశాం, ఇలా ఉపవాసం ఉంది కేవలం పానీయం మాత్రం తీసుకుని జీవించిన వారిని చూశాం అయితే ఏ ఫుడ్ తీసుకోకుండా టీ తాగి బతకడం అసలు ఎక్కడైనా విన్నారా.

- Advertisement -

ఆశ్చర్యపోతారు ఇలాంటిదే జరిగింది, పశ్చిమ బెంగాల్లోని దక్షిణ దీనాజ్పూర్ ప్రాంతానికి చెందిన వృద్ధురాలు నందరాణి మెహంతో టీ తప్ప మరేమీ తినకుండా 30 ఏళ్లుగా జీవిస్తోంది. ఆమె వయసు 67 సంవత్సరాలు, ఇక ఆమె ఇలా చేయడానికి ఓ కారణం ఉంది అని అంటున్నారు.

కుటుంబంతో గొడవ పెట్టుకుని 30 ఏళ్ల క్రితమే నందిరాణి కుమారుడు బంగ్లాదేశ్కు వెళ్లిపోయాడు. ఆ తర్వాతి నుంచి నందిరాణి అన్నం తినకుండా రోజుకు దాదాపు 10 కప్పుల టీ మాత్రమే తాగుతోంది.
అసలు ఆమె ఇంక ఏమీ తినకుండా ఎలా ఉంటుంది అనేది మాత్రం ఎవరికి అర్దం కావడం లేదు, అయితే అప్పుడప్పుడు పాన్ తింటుంది.. ఇక ఆమె ఎవరి ఇంటికి వెళ్లినా ఆమెకి టీ మాత్రమే ఇస్తారు. ఇక ఆమె టీలో ఎక్కువగా పాలు పోస్తుంది అందుకే ప్రొటీన్ కార్బోహైడ్రేట్స్ అందుతాయి అంటున్నారు వైద్యులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఇండియాలో ఎంటరైన మెటా AI

భారత్ లోకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ మెటా ఏఐ(Meta AI) అడుగుపెట్టింది....

ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల

ఎయిర్ ఫోర్స్(Airforce) లో ఉన్నత ఉద్యోగాలకు ఉద్దేశించిన కామన్ ఎంట్రెన్స్ టెస్ట్...