భారీగా పెరిగిన బంగారం వెండి ధ‌ర ఈరోజు రేట్లు ఇవే

భారీగా పెరిగిన బంగారం వెండి ధ‌ర ఈరోజు రేట్లు ఇవే

0
47

బంగారం ధ‌రల‌‌కు మ‌ళ్లీ రెక్క‌లు వ‌చ్చాయి… గ‌డిచిన వారం రోజులుగా డైలీ త‌గ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర మళ్లీ ప‌రుగులు పెట్టింది, నిన్న‌టి కంటే ఈరోజు మ‌ళ్లీ ధ‌ర‌లో పెరుగుద‌ల క‌నిపించింది..ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్లో గోల్డ్ ధ‌ర పెరిగింది. దీంతో బంగారం ధ‌ర ఇండియాలో పెరుగుతోంది. మ‌రి నేడు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.

హైదరాబాద్ మార్కెట్‌లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 180 రూపాయలు పెరిగి 48,340 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 200 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 52,730 రూపాయలుగా నమోదు అయింది.

ఈరోజు 300 రూపాయల పెరుగుదల నమోదు చేసింది వెండి. దీంతో 61 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు పెరిగాయి. దీంతో కేజీ వెండి ధర 61,000 రూపాయలకు చేరింది..వ‌చ్చే రోజుల్లో బంగారం వెండి ధ‌ర‌లు మ‌రింత పెరుగుతాయి అంటున్నారు బులియ‌న్ వ్యాపారులు, గ‌డిచిన వారం రోజులుగా షేర్ల ర్యాలీ కొన‌సాగింది, అందుకే బంగారం త‌గ్గింది, ఇప్పుడు మళ్లీ షేర్ల ప‌త‌నంతో బంగారం ధ‌ర పెరుగుతోంది.