వాకింగ్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు మీ సొంతం..

0
103

రోజు వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు పొందుతామని అందరికి తెలిసిందే. కానీ మనకు తెలియక చేసే చిన్న చిన్న తప్పుల వల్ల పూర్తి స్థాయిలో లాభాలు పొందక పోవచ్చు. కావున వాకింగ్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటూ వాకింగ్ చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందవచ్చు.

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారం తీసుకోవ‌డంతోపాటు వ్యాయామం కూడా శరీరానికి ఎంతో అవసరం. నడక ప్రారంభించడానికి ముందు కొన్ని నీరు తాగి నడక ప్రారంభించడం వల్ల  డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉండడంతో పాటు..అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా నీరు తాగి ప్రారంభించడం వల్ల ఎక్కువ సేపు ఆయాసం రాకుండా వాకింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది.

ఇంకా నడుస్తున్నప్పుడు చేతులను వదులుగా చేసి ముందుకు, వెనుకకు ఆడించాలి. దీనివల్ల శ‌రీరం రిలాక్స్ అయ్యి ఎక్కువ వ్యాయామం జ‌రుగుతుంది. అంతేకాకుండా వాకింగ్‌ను ప్రారంభించేట‌ప్పుడు నెమ్మ‌దిగా నడుస్తూ క్రమక్రమంగా  వేగం పెంచాలి. వాకింగ్ చేసేటప్పుడు షూస్ ధరించడం వల్ల ఎక్కువసేపు వాకింగ్ చేయాలనే ఆసక్తి కలుగుతుంది.