జుట్టు రాలడానికి గల ప్రధాన కారణాలివే..

0
101

ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలలో జుట్టు రాలడం కూడా ఒకటి. ఈ సమస్యకు అనేక కారణాలు ఉండగా..ముఖ్యంగా మనం చేసే ఈ ప‌నుల వ‌ల్లే జుట్టు ఎక్కువ‌గా రాలుతుందని నిపుణులు చెబుతున్నారు. మ‌నం రోజూ మూడు పూట‌లా భోజ‌నం చేయకపోయినా జుట్టు రాలే సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఎందుకంటే శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ లభించక ఈ సమస్య వేధిస్తుంది. అంతేకాకుండా చ‌ల్ల‌గా లేదా మ‌రీ వేడిగా ఉండే నీటితో  కూడా స్నానం చేయకూడదట. అందుకే అలా కాకుండా గోరు వెచ్చ‌ని నీటితో స్నానం చేయాలి. మ‌రీ చ‌ల్ల‌గా లేదా మ‌రీ వేడిగా ఉండే నీటితో త‌ల‌స్నానం చేస్తే జుట్టు రాలిపోయేందుకు ఎక్కువ అవ‌కాశాలు ఉంటాయి.

కాబ‌ట్టి గోరు వెచ్చ‌ని నీటితో త‌ల‌స్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.  ఇక కొంద‌రు వేసుకునే కొన్ని ర‌కాల మెడిసిన్ల వ‌ల్ల కూడా జుట్టు రాలుతుంది. ముఖ్యంగా యాంటీ డిప్రెష‌న్‌, యాంటీ యాంగ్జ‌యిటీ, యాంటీ హైప‌ర్ సెన్సిటివ్‌, థైరాయిడ్ మందులు జుట్టు రాల‌డాన్ని ప్రోత్స‌హిస్తాయి. క‌నుక ఈ మందుల‌ను వాడేవారు వైద్యుల స‌ల‌హా తీసుకోవడం మంచిది.