వ‌ర్షాకాలం వచ్చేస్తుంది..ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

0
136

సాధారణంగా వర్షాకాలంలో మనం ఎంత జాగ్రత్తగా ఉన్న అనేక రకాల సమస్యలు మనల్ని చుట్టుముడుతుంటాయి. అందుకే మనం తీసుకునే ఆహారం, బట్టలపై శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా కాలానికి అనుగుణంగా బట్టలు వేసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు మనదరికి చేరవు. ఇంకా వర్షాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

వర్షాకాలంలో మహిళలు  మేకప్ వీలయినంత వరకు వేసుకోకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా కాటన్, సింథటిక్ ఫ్యాబ్రిక్ వంటి దుస్తులను ధరించడం మంచిది. టైట్ జీన్స్ కు దూరంగా ఉండడంతో పాటు..ఎట్టి పరిస్థితుల్లో తడిగా ఉన్న బట్టల్ని వేసుకోకూడదదు.  వర్షాకాలంలో ఇంటిని పరిమళభరితంగా మార్చుకోవాలి.

ఓ గిన్నెలో మూడొంతుల నీళ్లు పోసి అందులో కొన్ని చుక్కలు లావెండర్‌, శాండల్‌వుడ్‌ ఆయిల్‌ వేసి హాలులో ఓ మూల పెట్టడం వల్ల గది మొత్తం సువాసనతో నిండిపోతుంది. కడిగిన గిన్నెలను బాగా ఆరిన తర్వాతే వంటలు చేసుకోవడం మంచిది. ఉతికిన దుస్తులను బాగా ఆరిన తర్వాతే కప్‌బోర్డులో పెట్టడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు మనదరికి చేరవు.