మోసంబి బ‌త్తాయి పేరు ఏదైనా ప్ర‌యోజ‌నాలు ఎన్నో ఉన్నాయి ఓసారి చూద్దాం

There are a number of benefits to using Mosambi

0
68

ఈ పండుని ఏ పేరుతో పిలిచినా ప్ర‌యోజ‌నాలు మాత్రం చాలా ఉంటాయి. కొంద‌రు ఈ పండుని మోసంబి అంటారు మ‌రికొంద‌రు బ‌త్తాయి అంటారు. వీటిని తిన్నా జ్యూస్ చేసుకుని తాగినా చాలా మంచిది. వైద్యులు కూడా ఈ మోసంబి తీసుకోవ‌చ్చు అని చెబుతారు. ఎవ‌రైనా అనారోగ్యంగా ఉంటే క‌చ్చితంగా ఈ బ‌త్తాయి ర‌సం ఇవ్వ‌డం జ‌రుగుతుంది.

అలసట, బలహీనతను పోగొడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి.
విటమిన్ సి, ఫైబర్ బ‌త్తాయిలో ఎక్కువ‌గా ఉంటాయి.స‌మ్మ‌ర్ లో రోజూ ఓ గ్లాస్ జ్యూస్ తీసుకుంటే చాలా ఎన‌ర్జీగా ఉంటారు. గుండె స‌మ‌స్య‌లు రాకుండా చేస్తుంది. వికారం స‌మ‌స్య రాకుండా ఈ పండు హెల్ప్ చేస్తుంది.

జీర్ణక్రియ మెరుగుఅవుతుంది. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతుంది.
విరేచనాలు, వాంతులు, వికారంగా ఉన్నప్పుడు మోసంబి జ్యూస్ తీసుకోవాలి. ఇక ఇమ్యునిటీ ప‌వ‌ర్ పెరుగుతుంది. నోటి పుండ్లు స‌మ‌స్య ఉన్నా ఈ జ్యూస్ తాగినా పండు తీసుకున్నా త‌గ్గుతాయి.
క్యాన్సర్ వ్యాధిని నియంత్రిస్తుంది. కురులు బ‌లంగా అవ్వాల‌న్నా ఈ పండు తీసుకోవ‌డం మంచిది.