రోజు పరగడుపున కరివేపాకులు తీసుకుంటే ఎంతో మేలు!

0
45

వంటకాలలో కరివేపాకులను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే కరివేపాకు అధికంగా తినడం వల్ల  ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకాకుండా చర్మ సౌందర్యాన్ని, జుట్టు సమస్యలను చెక్ పెట్టడంలో కూడా కరివేపాకు సహాయపడుతుంది. ఇంకా రోజు పరగడుపున కరివేపాకులు తినడం వల్ల కలిగే లాభాలు ఇప్పుడు చూద్దాం..

కరివేపాకులో భాస్వరం, కాల్షియం, ఇనుము, రాగి, విటమిన్లు, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ప్రతిరోజూ ఉదయం 3 నుంచి 4 పచ్చి ఆకులను నమిలి తింటే ఎలాంటి ఖర్చు లేకుండా అనేక ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. కరివేపాకు ఆకులలో ఉండే విటమిన్ ఎ కారణంగా కంటి చూపు మెరుగుపడుతుంది.

అంతేకాకుండా కరివేపాకులో యాంటీ ఫంగల్, యాంటీబయాటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. వ్యాధులను మనదరికి చేయకుండా కాపాడడంలో కూడా కరివేపాకు సహాయపడుతుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు కరివేపాకును నమిలి తినడం వల్ల బరువు, పొట్ట కొవ్వు తగ్గుతుంది.