మొలకెత్తిన ఉల్లిపాయలు తినడం వల్ల బోలెడు ప్రయోజనాలివే..!

0
85

ఉల్లిపాయలు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని అందరికి తెలుసు. మనం నిత్యం వంటలో వేసే పదర్థం ఏదైనా ఉందంటే అది ఉల్లి మాత్రమే. దీనిని తినడానికి చాలామంది ఇష్టపడరు. కానీ దీని లాభాలు తెలిస్తే దేనిని అధికంగా తింటుంటారు. ఇంకా ముఖ్యంగా మొలకెత్తిన ఉల్లిపాయలు తినడం మ‌న శ‌రీరానికి అపార‌మైన లాభాలు చేకూరుతాయి. అవేంటో మీరు కూడా చూడండి.

మొల‌కెత్తిన ఉల్లిపాయ‌ల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. దీనివల్ల ఎముక‌లు, దంతాలు స్ట్రోంగ్‌గా, ఆరోగ్య‌వంతంగా తయారవుతాయి. అలాగే ముఖ్యంగా వేస‌వి కాలంలో అధిక వేడి నుండి ఉపశమనం పొంది శరీరం చల్లబడడానికి మొల‌కెత్తిన ఉల్లిపాయ‌లు అద్భుతంగా ఉపయోగపడతాయి. వీటిని మజ్జిక రూపంలో కలుపుకొని తీసుకుంటే మరి మంచిది.

మొల‌కెత్తిన ఉల్లిపాయ‌లతో జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. మూత్ర కోశ సమస్యలు కూడా దూరమవుతాయి. మొల‌కెత్తిన ఉల్లిపాయ‌ల్లో ప్రోటీన్ కూడా అధికంగా ఉంటుంది. ఈ మొలకలు నేరుగా తింటే కాస్త చేదుగా ఉంటాయి. అందుకే ఉల్లి ముక్కలను కూరల్లో వేసుకొని తినడం మంచిది.