తులసి చెట్టును రోజూ ఇలా పూజించడం వలన ఎన్ని ప్రయోజనాలంటే

There are many benefits to worshiping the basil tree on a daily basis

0
98

మన హిందూ సంస్కృతి, సంప్రదాయాల్లో తులసికి ఎంతో ప్రత్యేకమైన స్ధానం ఉంది. ప్రతీ ఇంట్లో తులసి మొక్క కచ్చితంగా ఉంటుంది. మనం తులసి చెట్టును దేవతగా భావిస్తుంటాం. ఇంట్లో తులసి మొక్క ఉంటే ఎంతో పాజిటీవ్ ఎనర్జీ ఉంటుంది. అంతేకాదు ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తులసిని ఆయుర్వేదంలో కూడా వాడతారు. అనేక మందుల తయారీకి ఈ మొక్కని ఆకులని వాడతారు.

తులసి చెట్టును రోజూ పూజించడం వలన ఎలాంటి ప్రయోజనాలు అనేది చూద్దాం.

1. భార్య భర్తల మధ్య ఏదైనా వివాదం ఉంటే తులసి చెట్టుకి నీరు పోసి పూజిస్తే ఏ సమస్య ఉన్నా తొలగిపోతుంది.
2. ఇంట్లో అనారోగ్యంగా ఎవరైనా ఉంటే, చెంబుడు నీరు తులసి మొక్కకి పోయండి వారికి ఆరోగ్యం బాగుంటుంది.
3. ఇక తులసిని ఈశాన్యం వైపు పెట్టకుండా ఎక్కడైనా పెట్టుకోవచ్చు.
4. తులసి జలం ఇంట్లో వ్యాపారంలో చల్లితే, కచ్చితంగా మంచి లాభాలు వస్తాయి.
5. తులసి మొక్కని రాత్రి తుంచకూడదు దీని వల్ల అరిష్టం కలుగుతుంది
6. తులసి మొక్కని వ్యాపారం చేసే చోట పెట్టవద్దు పెరటిలోనే ఉంచడం మంచిది.
7. తులసి ఎప్పుడూ వాడకుండా చూసుకోవాలి అప్పుడు ఆ ఇంటి మనుషులకి రాణింపు ఉంటుంది.
8. వ్యాపారానికి వెళ్లే వారు తులసి చెట్టుని తాకి నమస్కరించి వెళితే ఎంతో పుణ్యం.
9..ఇంటి ఆగ్నేయ దిశలో తులసి మొక్కను నాటితే మంచిది.
10. వృత్తి వ్యాపారంలో రాణింపు ఉండాలి అంటే ప్రతిరోజూ నెయ్యితో దీపం వెలిగించాలి.