ప్రకృతిలో వివిధ రకాల ఔషధ మొక్కలు ఉంటాయి.వాటివల్ల అనేక ప్రయోజనాలుంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పూర్వంలో ఔషధ మొక్కలతోనే ఎలాంటి సమాసాలకైనా ఇట్టే చెక్ పెట్టేవారు. ముఖ్యంగా తులసి, వేప, కలబంద వల్ల ప్రయోజనాలు తెలియనివారుండరు. శాస్త్రవేత్తలు తాజాగా చేసిన పరిశోధనలో కలబంద వల్ల అద్భుత ప్రయోజనాలు వెలువడినాయి. అవేంటో మీరు కూడా ఓ లుక్కేయండి..
కలబంద గుజ్జుతో కేవలం ఆరోగ్యపరంగానే లాభాలు కాకుండా..జుట్టుకు, సౌందర్యానికి కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఎలాంటి ఖర్చు లేకుండా అన్ని జుట్టు సమస్యలకు వెంటనే చెక్ పెడుతుంది. కలబందలోని ప్రోటీయోలైటిక్ ఎంజైములు, మాడుపై నష్టపోయిన కణాలను పునరుజ్జీవింప చేస్తాయి. దీంతో వెంట్రుకలు ఆరోగ్యవంతంగా తయారయ్యి జుట్టు త్వరగా పెంచడంలో సహాయపడుతుంది.
కలబంద గుజ్జు జుట్టు తెగిపోవడాన్ని అరికడుతుంది. కావున తలస్నానం చేసే ముందు జుట్టుకు కలబంద పెట్టడం వల్ల జుట్టు తెగకుండా ఉంచడం వల్ల ఎక్కువ పరిమాణం ఉన్నట్లు కనిపిస్తుంది. కొబ్బరినూనె మరియు కలబంద గుజ్జులను కలిపి జుట్టుకు క్రమం తప్పకుండా రాసుకుంటే, బలంగా, మృదువుగా, ఒత్తుగా మారుతుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.