నేలపై పడుకోవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే..!

0
127

ప్రస్తుతం మారుతున్న జీవనవిధానంతో ఒత్తిడి కారణంగా రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపోయే వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గుతుంది. కానీ మనిషి ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవడం తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ముఖ్యంగా నేలపై పడుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అవేంటో మీరు కూడా ఓ లుక్కేయండి..

మంచంపై నిద్రపోవడం వల్ల కలిగే లాభాలకంటే రెట్టింపు లాభాలు నేలపై పడుకోవడం వల్ల కలుగుతాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు నేలపై పడుకోవడం అలవాటు చేసుకోవాలి. నేలపై నిద్రపోవడం వల్ల నొప్పులు తగ్గడంతో పాటు శరీరం రిలాక్స్ అవుతుందని తాజాగా చేసిన పరిశోధనలో వెల్లడయింది.

అంతేకాకుండా రక్తప్రసరణ సక్రమంగా జరగడానికి కూడా నేలపై పడుకోవడం మంచిది. ఇంకా ముఖ్యంగా దిండు లేకుండా నేలపై పడుకుంటే శరీరం మొత్తానికి ఉపశమనం కలగడంతో పాటు..ఎలాంటి సమస్యలు మనదరికి చేరకుండా కాపాడుతుంది. నేలపై పడుకోవడం వల్ల భుజాల నొప్పులు తగ్గడంతో పాటు నిద్రలేమి సమస్యకు కూడా చెక్ పెడుతుంది.