వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల అదిరిపోయే ప్రయోజనాలివే..!

0
90

కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ముఖ్యంగా వేసవిలో ఎండల నుండి ఉపశమనం పొందడానికి దీనిని అధికంగా తీసుకుంటారు. అంతేకాకుండా దీనివల్ల ఎన్నో అదిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

మెగ్నిషియం, క్యాల్షియం, పొటాషియం, సోడియం వంటి అనేక రకాల పోషకాలు మనకు లభిస్తాయి శరీరంలో సహజ లవణాల్ని కోల్పోయినప్పుడు కలిగే అలసట నుంచి కొబ్బరి నీరు కాపాడుతుంది. డయేరియాతో ఇబ్బంది పడే పిల్లలకు డీహైడ్రేషన్ రాకుండా కాపాడే పానీయం కొబ్బరి నీరు.

వేసవిలో కొబ్బరి నీళ్లను తప్పనిసరిగా తాగాలి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కాలేయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి