చాలా మంది ఇప్పటికీ అసలు గుడ్డు తినచ్చా లేదా అని డౌట్ గా అడుగుతారు, అయితే వైద్యులు మాత్రం గుడ్డు తినడం మంచిదే అని అంటున్నారు, తక్కువ రేటులో దొరికే పోషకాహరం అని అంటున్నారు.
ఇది శరీరంలో HDL కొలస్ట్రాల్ ను పెంచుతుంది. అంటే శరీరానికి మేలు చేసే కొవ్వు ని పెంచుతుంది.
ఇక రక్తనాళాల గుండెజబ్బులు అస్సలు రాకుండా ఉంటాయి, అలాగే ఎముకలు బలంగా ఉంటాయి
మీరు ఉడకబెట్టిన గుడ్డు తీసుకుంటే అందులో ఉండే పోషకాలు రక్తాన్ని గడ్డకట్టకుండా చేస్తాయి. గుడ్డులో లభించే కెరోటినాయిడ్స్ ల్యూటిన్,జేక్సటిన్ అనే పోషకాలు కంటి సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది..
ఇందులో మంచి ప్రొటీన్ ఉంటుంది, ఒక కోడిగుడ్డు సోనలో 300 మైక్రో గ్రాముల కొలైన్ లభిస్తుంది. ఈ పోషకం మెదడు పనితీరు,నరాల వ్యవస్థ బలంగా ఉండటానికి దోహదం చేస్తుంది.ఇక మహిళల్లో రొమ్ము క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది, రోజుకి ఒకగుడ్డు తీసుకోవడం మంచిది, జిమ్ వర్క్ అవుట్లు అంటూ చేసే వారు, రెండు తీసుకోవడం మంచిది అంటున్నారు, కేవలం రోజు ఒక గుడ్డు తీసుకుంటే మంచిది అంటున్నారు వైద్యులు.