దానిమ్మ పండు వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకరప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండు వల్ల మన గుండెకు చాలా మంచిది. రక్తం కూడా పడుతుంది. అంతేకాదు అనేక మెడిసన్స్ ఆయుర్వేదంలో కూడా ఈ పండుని వాడతారు.దానిమ్మ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
మనం రోజుకి ఒకసారి అయినా లేదా రెండు మూడు రోజులకి ఓసారి అయినా ఈ దానిమ్మ తీసుకోవడం వల్ల శరీరానికి చాలా మంచిది. గుండె వ్యాధులను నిరోదిస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది.క్యాన్సర్ నిరోధానికి ఇది ఎంతో సహాయం చేస్తుంది.
జీర్ణక్రియకు సహాయం చేస్తుంది, ముఖ్యంగా మలబద్దకం పైల్స్ ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. దానిమ్మ తీసుకుంటే
రోగనిరోధక శక్తి పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా దానిమ్మలో యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆస్టియో ఫ్లోరోసిస్ ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉన్న వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. యాంటీబాడీల ఉత్పత్తి పెరుగుతుంది. ఇమ్యునిటీ పవర్ పెరుగుతుంది.