మొలకెత్తిన గింజలు Sprouts అనేది చాలా మంది తింటూ ఉంటారు. దీని వల్ల మంచి ఆరోగ్యం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది అంటున్నారు నిపుణులు. ఉదయం చాలా మంది Sprouts తింటూ ఉంటారు. ఇందులో విటమిన్లు ఖనిజాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ప్రతిరోజూ గుప్పెడు మొలకెత్తిన గింజలు తినడం వలన ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి.
మీరు వీటిని బ్రేక్ ఫాస్ట్, స్నాక్స్, లంచ్, డిన్నర్ లో తీసుకోవచ్చు అయితే డిన్నర్ కంటే లంచ్ బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే శరీరానికి ఇంకా మేలు జరుగుతుంది. పెసలు శనగలు అలసందలు ఇవన్నీ కూడా మనం Sprouts గా తీసుకుంటాం . వీటిని ముందుగా మనం శుభ్రంగా కడగాలి వాటిని రాత్రి నానబెట్టి ఉదయం వాటిని తీసుకుని కాటన్ క్లాత్ లో ముడి వేసి ఉంచాలి.
అప్పుడు ఈ గింజలు తెల్లారేసరికల్లా మొలకలు వస్తాయి. ఇందులో మీరు చాలా ప్రోటీన్ పొందవచ్చు మాంగనీసు, మెగ్నీషియం, పాస్పరస్, ఫోలేట్ , విటమిన్ సి, విటమిన్ కె ఇలా ఎన్నో పోషకాలు వస్తాయి. బరువు తగ్గాలి అని అనుకునేవారు ఇవి తింటే ఎంతో మంచిది. ఇందులో ఫైబర్ ఉంటుంది దీని వల్ల మలబద్దకం సమస్యలు పోతాయి. ఇందులో కొవ్వు చాలా తక్కువ ఉంటుంది. ఇవి తినడం వల్ల ఇమ్యునిటీ పవర్ పెరుగుతుంది.