ఆకాకరకాయ తింటే కలిగే ప్రయోజనాలు ఇవే

-

చాలా మందికి కాకరకాయలు మాత్రమే తెలుసు, అయితే ఆ కాకర కాయలు మాత్రం తెలియదు, అయితే ఈ కాయలు చాలా ఫేమస్, కొన్ని ప్రాంతాల్లో బోడ కాకర కాయ అని కూడా వీటిని పిలుస్తారు, ఇవి ఎక్కువగా అడవుల్లో పండుతాయి, ఇక ఇవి కూడా శరీరానికి చాలా మంచిది. ఇందులో ఉండే గింజలు కూడా మరీ అంత చేదు ఉండవు.

- Advertisement -

అందుకే వీటిని ఉల్లిపాయ మసాలాతో కూర కూడా చాలా మంది వండుతారు, అయితే ఆకాకర కాయల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి… పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి.

ఇక ఆకాకరలోని విటమిన్-సి ఉంటుంది, ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. వర్షాకాలంలో ఇవి ఎక్కువగా దొరుకుతాయి, ఇవి తింటే జలుబు, దగ్గు జ్వరం తగ్గుతాయి, అంతేకాదు అలెర్జీలు కూడా రావు, ఇక జీర్ణ వ్యవస్ధ మెరుగు అవుతుంది, కాన్సర్ల బారిన పడకుండా రక్షిస్తాయి. ఇక డయాబెటిస్ తో బాధపడేవారు కూడా ఇవి తినవచ్చు.. ఇందులో ఉంటే కెరోటెనాయిడ్లు కంటి సంబంధ వ్యాధులు రాకుండా కాపాడతాయి, ఇవి పది రోజులకి ఓసారి తిన్నా చాలా మంచిది… ఇక మలబద్దక సమస్యలు కూడా తగ్గుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...