మల్లెపువ్వులు పెట్టుకోవడం వేనుక గల అసలు కారణాలివే..

0
79

గతంలో పువ్వులు పెట్టుకోవడానికి మహిళలు చాలా ఆసక్తి చూపేవారు. కానీ ప్రస్తుతం నూటికి ఒక్కరు మాత్రమే పువ్వులు పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. మనకు తెలిసిన వరకు కేవలం అందం కోసం లేదా సాంప్రదాయ బద్దంగా మాత్రమే మల్లె పువ్వులను పెట్టుకున్నామని అనుకుంటాము. కానీ దీని వెనుక ఎవరికి తెలియని అత్యంత రహస్యమైన విషయం ఉంది. అదేంటో తెలుసుకోవాలని మీరు కూడా ఆతృత పడుతున్నారా? మరి ఇంకా ఆలస్యం ఎందుకు వెంటనే చూసేయండి..

పువ్వులు పెట్టుకోవడం మొదటగా భారతదేశంలో ప్రారంభమయింది. మల్లెపువ్వు వాసన అంటే ఇష్టపడని వారు దాదాపు ఎవ్వరు ఉండరు. స్త్రీలు తలలో మల్లెపూలు పెట్టుకుంటే ఇంట్లో అందరూ సంతోషంగా ఉండడంతో పాటు..ఆ ఇల్లు లక్ష్మీ దేవి నిలయంగా మారుతుందని నమ్ముతుంటారు. అందుకే ప్రతి ఒక్క మహిళా ఎల్లప్పుడు పువ్వులు పెట్టుకోవాలని పెద్దలు చెబుతున్నారు. ఈ పువ్వు లేకుండా ఎటువంటి పండగైనా పూర్తికావడం అసాధ్యం.

ఇది శ్రేయస్సుకు, అదృష్టానికి చిహ్నంగా కూడా పరిగణిస్తారు. మల్లెపూలు నుంచి వచ్చే మంచి సువాసన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే చిన్న పిల్లల తల్లులు ఈ పూలను పెట్టుకుంటే మంచి ఫలితాలు చేకూరుతాయి. దానివల్ల తన బిడ్డకు ఎక్కువ రోజులు పాలు ఇస్తారని పెద్దలు చెబుతుంటారు. అలాగే ఇలా ప్రతి ఒక్క పువ్వు పెట్టుకోవడం వెనుక ఏదో ఒక ప్రత్యేకత దాగి ఉంటుంది.