Healthy Heart | ఈ చిన్నచిన్న ఆహారపు అలవాట్లతో గుండె ఆరోగ్యం పదిలం

-

Healthy Heart | గుండె ఆరోగ్యంగా ఉన్నంతవరకే మన జీవనం సాఫీగా సాగుతుంది. ఏ కారణం వలనైనా మన గుండె అనారోగ్యం బారిన పడితే ప్రాణాలకే మక్కువ వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. మనం రోజువారి తినే ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు.

- Advertisement -

మీగడ పెరుగు కాకుండా వెన్న తీసిన పాలతో చేసిన పెరుగు గుండెకు ఎంతో మేలు చేస్తుంది. ఈ పెరుగులో గుండెపోటును అదుపులో ఉంచే పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం, ఖనిజ లవణాలు ఎన్నో ఉంటాయి. అధిక రక్తపోటు (హై బీపీ) కారణంగా రక్తనాళాల మార్గం సంకోచించి గుండె మీద ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి భోజనంలో పెరుగు మజ్జిగ చేర్చుకోవడం మంచిది.

అలాగే గింజ పప్పుల్లో వృక్ష రసాయనాలు, గుండెకి మేలు చేసే కొవ్వు, పీచు పదార్థాలు(Fibrous substances) మెండుగా ఉంటాయి. సోడియం తక్కువగా ఉంటుంది. ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.

రోజుకు అర కప్పు అక్రూట్స్ తినేవాళ్లలో కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటున్నాయని అధ్యయనాలలో వెల్లడైంది.

Healthy Heart | చిక్కుడు జాతి కూరగాయల్లో పొటాషియం, వృక్ష రసాయనాలతో పాటు రెండు రకాల పీచు పదార్థాలు ఉంటాయి. నీటిలో కరిగే పీచు రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకుంటుంది. నీటిలో కరగని పీచు కడుపు నిండిన భావన ఇస్తూ బరువు అధికంగా పెరగకుండా కాపాడుతుంది. కొలెస్ట్రాల్, అధిక బరువు రెండు గుండెజబ్బు కారకాలేనని తెలిసిందే.

సముద్ర చేపల్లో గుండెకు హాని కలిగించే సంతృప్త కొవ్వు తక్కువగా ఉంటుంది. వీటిలో హార్ట్ బీట్ స్టేబుల్ గా ఉండటానికి, రక్తనాళాలు మెరుగ్గా పనిచేయడానికి సహకరించే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. గుండెను కాపాడే పొటాషియం, మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటాయి.

పాలకూర వంటి ఆకుకూరల్లో ఉండే నైట్రేట్లను మన శరీరం నైట్రిక్ ఆక్సైడ్ గా మారుస్తుంది. ఇది బ్లడ్ సర్కులేషన్ సాఫీగా జరగడానికి, బీపీ కంట్రోల్ లో ఉండడానికి తోడ్పడుతుంది. అందుకే పాలకూరను మన రోజువారీ తీసుకునే ఆహారంలో చేర్చుకోవడం మంచిది. పాలకూరలో వృక్ష రసాయనాలు, పీచు పదార్థాలు, రక్తం గడ్డలుగా ఏర్పడకుండా చూసే ఫోలేట్ అనే బీ విటమిన్ కూడా ఉంటుంది.

Read Also: అరికాళ్ళలో నొప్పి వేధిస్తుందా? ఇవి పాటించండి!!
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ramamurthy Naidu | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంట తీవ్ర విషాదం

తమ్ముడు నారా రోహిత్(Nara Rohit) తండ్రి నారా రామ్మూర్తి నాయుడు(Ramamurthy Naidu)...

Glowing Skin | చలికాలంలో మెరిసిపోయే చర్మం కోసం టిప్స్

Glowing Skin | చలికాలంలో డ్రై స్కిన్ వేధిస్తుంటుంది. దీనికి తోడు...